← Back to Events
ప్రతి పౌరుడు తమ బాధ్యతలను, హక్కులను తెలుసుకోవాలి  ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య  విజయవంతమైన వాజేడు, వెంకటాపురం మండలాల సమావేశం
వెంకటాపురం/వాజేడు/ములుగు2026-06-19

ప్రతి పౌరుడు తమ బాధ్యతలను, హక్కులను తెలుసుకోవాలి ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య విజయవంతమైన వాజేడు, వెంకటాపురం మండలాల సమావేశం

ప్రతి పౌరుడు తమ బాధ్యతలను, హక్కులను తెలుసుకోవాలని, వాటి పట్ల అవగాహన కలిగి గొప్ప సమాజం కోసం కృషి చేయాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య అన్నారు.వెంకటాపురం మండల అధ్యక్షులు రాయుడు జయరాజు అధ్యక్షతన మండల కేంద్రంలో జరిగిన వాజేడు, వెంకటాపురం రెండు మండలాల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో అవినీతి అక్రమాలు పెరిగిపోతున్నాయని వాటినీ నిరోధించడానికి ప్రతి ఒక్కరు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉపయోగించుకొని ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం లీగల్ ప్రొసీజర్ తో తమ జాతీయ మానవ హక్కుల కమిటీ తీవ్రంగా కృషి చేస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గోగులమూడి హరికృష్ణ, కుంట ఏడుకొండలు, పిల్లల లీలారాణి, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి సన్నగుండ్ల వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు గాదే శ్రీనివాసచారి, జిల్లా కమిటీ సభ్యులు లూర్ద్ రాజు, గుర్రం సుభాషిని, గుర్రం రాజేష్, శెట్టిపల్లి రామకృష్ణ, మంగపేట మండల ఉపాధ్యక్షులు గుడిసేవ నాగేశ్వరరావు, ములుగు వెంకటాపూర్ మండల ఉపాధ్యక్షులు పులాల రమేష్,వాజేడు, వెంకటాపురం మండలాలలోని మహిళా సంఘాల ప్రతినిధులు, సామాజిక ఉద్యమకారులు, విద్యావంతులు సుమారుగా 500 మంది భారీగా స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకర్షించాయి. అనంతరం ప్రధాన కార్యదర్శి సన్నగుండ్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వాజేడు మండల కమిటీని ప్రకటించారు. వెంకటాపురం మండల కమిటీలో స్వల్ప మార్పు చేర్పులు చేసి పూర్తిస్థాయి మండల కమిటీని ప్రకటించారు.