Events & Activities

Stay updated with the latest activities and events organized by NHRC.

జాతీయ మానవ హక్కుల కమిటీ హనుమకొండ జిల్లా కమిటీ ముఖ్య నాయకుల సమావేశం

జాతీయ మానవ హక్కుల కమిటీ హనుమకొండ జిల్లా కమిటీ ముఖ్య నాయకుల సమావేశం

హన్మకొండ

2026-08-04

*జాతీయ మానవ హక్కుల కమిటీ హనుమకొండ జిల్లా కమిటీ సమావేశం* *సంస్థ విధి విధానాలపై అవగాహన కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య* హనుమకొండ,ఆగస్టు03(అక్షరజ్యోతి ప్రతినిధి): జాతీయ మానవ హక్కుల కమిటీ(ఎన్‌హెచ్‌ఆర్‌సి) హనుమకొండ జిల్లా కమిటీ ముఖ్య నాయకుల సమావేశం జిల్లా అధ్యక్షులు పల్లెబోయిన మహేష్ ముదిరాజ్ అధ్యక్షతన హనుమకొండ జిల్లా కేంద్రంలోని చింత చింతగట్టు ఎస్‌పీ ఆర్ గార్డెన్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణే సంస్థ ప్రధాన లక్ష్యమని, సమాజంలో అణగారిన వర్గాలకు న్యాయం అందించేందుకు ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలని పిలుపునిచ్చారు. సంస్థ విధి విధానాలు, రాజ్యాంగ పరమైన హక్కులు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సామాన్య ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అన్యాయానికి గురైన బాధితులకు తక్షణ న్యాయ సహాయం అందించేందుకు జిల్లా కమిటీ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అక్షరజ్యోతి మీడియా పాత్రపై పూర్తిస్థాయి విశ్లేషణ చేస్తూ, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో మీడియా బాధ్యత ఎంతో ఉందని తెలిపారు. జిల్లాలో సంస్థ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకులను అభినందించారు. రాబోయే రోజుల్లో గ్రామస్థాయి వరకు కమిటీలను విస్తరించి, మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ఇన్చార్జి గూడూరు నరేందర్, జిల్లా ఉపాధ్యక్షులు కొడవటి తిరుపతి, ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, శాయంపేట మండల అధ్యక్షులు ఏదుల రాజశేఖర్, నడికూడ మండల అధ్యక్షులు ప్రవీణ్, సంగెం మండల అధ్యక్షులు రాజేందర్ యాదవ్, నాయకులు ఆనందం, సూరపాక రాజు, బిక్షపతి, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

Read More →
జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) కరెంట్ అకౌంట్

జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) కరెంట్ అకౌంట్

హైదరాబాద్

2026-07-23

జాతీయ మానవ హక్కుల కమిటీ చేస్తున్న సేవా కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థికపరమైన అంశాలకు కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది

Read More →
ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

హైదరాబాద్

2026-07-23

*ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి* *రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి వినతి పత్రం అందజేత* *జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి దుర్గం రఘునాథ్* హైదరాబాద్,జూలై22(అక్షరజ్యోతి ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల జీవనోపాధి తీవ్ర సంక్షోభంలో ఉందని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలుతో ఆటో డ్రైవర్ల రోజువారీ ఆదాయం 40 శాతం వరకు పడిపోయిందని జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి దుర్గం రఘునాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి వినతి పత్రం అందజేసిన ఆయన, ప్రస్తుతం రోజుకు ₹200–₹300 కూడా మిగలని పరిస్థితి ఉందని, ఫైనాన్స్ కిస్తీలు, బ్యాంకు రుణాలు, అద్దె, ఇంధన ఖర్చులు తీర్చలేక ఆటో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇప్పటివరకు రాష్ట్రంలో 150 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి ₹12,000 ఆర్థిక సహాయం అందించే ప్రత్యేక కార్పొరేషన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని, రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం ₹100 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ల కుటుంబాలకు ₹25 లక్షల నష్టపరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఏ కారణంతో మరణించినా ₹5 లక్షల బీమా, 50 ఏళ్లు దాటిన వారికి నెలకు ₹10,000 గౌరవ పెన్షన్, తక్కువ వడ్డీ రుణాలు, బీమా ప్రీమియం తగ్గింపు, అనధికారిక రవాణా కార్మికుల సామాజిక భద్రతా బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఇంధన ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, యాప్ ఆధారిత సేవల కారణంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆటో వ్యాపారం 50 శాతం వరకు తగ్గిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో డ్రైవర్ల కుటుంబాలకు జీవన భద్రత కల్పించాలని దుర్గం రఘునాథ్ వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు.

Read More →
దైవాలగూడ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిటీ ఆందోళన*

దైవాలగూడ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిటీ ఆందోళన*

హైదరాబాద్

2026-07-18

*దైవాలగూడ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిటీ ఆందోళన* *నేరాలకు, ఘోరాలకు సంబంధించిన మూలాలను లోతుగా విశ్లేషించాలి* *రాష్ట్ర కమిటీ సభ్యురాలు అస్మత్ ఉన్నిసా* హైదరాబాద్,జూలై12(అక్షరజ్యోతి ప్రతినిధి):రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో జరిగిన ఆరుగురి సామూహిక హత్యల ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిందని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. చిన్నారిపై అత్యాచారం కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన వ్యక్తి మళ్లీ ఆరుగురిని అత్యంత దారుణంగా హత్య చేయడం న్యాయ వ్యవస్థలో, శిక్షల అమలులో ఉన్న లోపాలను స్పష్టంగా చూపిస్తోందని రాష్ట్ర కమిటీ సభ్యురాలు అస్మత్ ఉన్నిసా అన్నారు. ఇటీవల రాష్ట్రంలో కుటుంబాల్లో హత్యలు, దాడులు విపరీతంగా పెరుగుతున్నాయని, భర్తలు భార్యలను, భార్యలు భర్తలను, తల్లిదండ్రులు కన్నబిడ్డలను కూడా చంపుకుంటున్న ఘటనలు సమాజంలో మానవీయ విలువలు క్షీణిస్తున్నాయనడానికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఆర్థిక ఒత్తిళ్లు, నిరుద్యోగం, మానసిక ఒత్తిడి, సోషల్ మీడియా, యూట్యూబ్‌లలో హింసను ప్రేరేపించే కంటెంట్ ప్రధాన కారణాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. నేరాలను కేవలం కఠిన శిక్షలతోనే కాకుండా మూలాల వద్ద నుంచి నివారించాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు ప్రభుత్వం సమగ్ర విధానం రూపొందించాలని కోరారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించే సోషల్ మీడియా పోస్టులు, హింసాత్మక వీడియోలు, ప్రజలకు ఉపయోగపడని యూట్యూబ్ సందేశాలపై ప్రభుత్వం కఠిన నిఘా పెట్టి వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణ న్యాయ సహాయం, ఆర్థిక పరిహారం అందించడంతో పాటు భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలను మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ఆధ్వర్యంలో త్వరలో అన్ని జిల్లాల కమిటీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి రాష్ట్రంలో నేరాల స్వభావం, కారణాలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ నాయకులు సురవరం రాజేంద్రప్రసాద్, తిరునగరి లావణ్య, అర్జున్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Read More →
పెట్రోల్ బంకులలో టైర్లలో గాలి సౌకర్యం కల్పించని యజమానులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి

పెట్రోల్ బంకులలో టైర్లలో గాలి సౌకర్యం కల్పించని యజమానులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి

ములుగు

2026-07-18

*పెట్రోల్ బంకుల్లో టైర్లకు గాలి సౌకర్యం కల్పించని యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలి* *జిల్లా కలెక్టర్,ఎస్పీ స్పందించాలని విజ్ఞప్తి* *జాతీయ మానవ హక్కుల కమిటీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి సన్నగుండ్ల వెంకటేశ్వర్లు* ములుగు: జిల్లాలోని అధిక శాతం పెట్రోల్ బంకుల్లో వాహనదారులకు కనీస సౌకర్యమైన టైర్లకు గాలి నింపే సౌకర్యం కూడా లేకపోవడం దుర్మార్గమని జాతీయ మానవ హక్కుల కమిటీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి సన్నగుండ్ల వెంకటేశ్వర్లు తీవ్రంగా విమర్శించారు. ఎక్కడైనా మిషన్ ఉన్నా మరమ్మతుకు వచ్చిందని,కరెంట్ లేదని చెప్పి వాహనదారులను బంకు యజమానులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. రోజుకు వేలాది వాహనాలు జిల్లా గుండా ప్రయాణిస్తుంటాయి. గాలి సౌకర్యం లేకపోవడంతో టైర్లలో గాలి తక్కువగా ఉండి ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది. పెట్రోల్,డీజిల్ కొన్న ప్రతి వినియోగదారుడికి ఉచితంగా గాలి నింపే సౌకర్యం కల్పించడం బంకు యజమానుల బాధ్యత అని, ఈ విషయంలో పెట్రోలియం నిబంధనలు కూడా స్పష్టంగా పేర్కొన్నాయని గుర్తు చేశారు. అయినప్పటికీ బంకుల యజమానులు నిబంధనలను గాలికి వదిలేసి వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున గౌరవ ములుగు జిల్లా కలెక్టర్, గౌరవ జిల్లా ఎస్పీ తక్షణమే స్పందించి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేసి,ప్రతి బంకులో పని చేసే స్థితిలో గాలి మిషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనలు పాటించని బంకులపై లైసెన్స్ రద్దుతో సహా కఠిన చర్యలు తీసుకోవాలని,బంకు యజమానులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడే ఇటువంటి నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం ఏమాత్రం సహించరాదని, సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని సన్నగుండ్ల వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు.

Read More →
రెవెన్యూ అధికారుల ఆస్తులపై ఏటా అడిట్ చేయాలి

రెవెన్యూ అధికారుల ఆస్తులపై ఏటా అడిట్ చేయాలి

వరంగల్

2026-06-29

రెవెన్యూ అధికారుల ఆస్తులపై ఏటా ఆడిట్ చేయాలి రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సోదాలు జరపాలి జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య వరంగల్,జూన్26(అక్షరజ్యోతి ప్రతినిధి):ఈ మధ్యకాలంలో ఏసీబీకి పట్టుబడుతున్న వారిలో ఎక్కువ శాతం రెవెన్యూ శాఖకు చెందినవారు ఉండటం ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చ అని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిని అరికట్టేందుకు రాష్ట్రంలోని రెవెన్యూ శాఖ అధికారుల, ఉద్యోగుల ఇళ్లల్లో ఒకేసారి సోదాలు నిర్వహించి లెక్కల్లో చూపని ఆదాయాన్ని జప్తు చేయాలని డిమాండ్ చేశారు. వారి పిల్లలు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో చదువుతుంటే ఆ యూనివర్సిటీలకు సమాచారం ఇచ్చి లంచాల సొమ్ముతో చదువుతున్నారనే విషయాన్ని తెలియజేయాలని, ట్యూషన్ ఫీజులు, జీవన వ్యయానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో విచారించాలని కోరారు. నిజాయితీగా సంపాదించిన సొమ్ముతో చదివితే సమస్య లేదని, లేకపోతే విద్యార్థులను ఇండియా రప్పించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తహసిల్దార్లతో పాటు ఆర్డీవోలు, కలెక్టరేట్ సిబ్బంది ఆస్తులను ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఆడిట్ చేయాలని, ఆస్తి వివరాలను బహిరంగంగా వెబ్‌సైట్‌లో ఉంచాలని అన్నారు. ఈ విధానాన్ని ఇంజనీరింగ్, రిజిస్ట్రేషన్, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులకు వర్తింపజేసి అన్ని డిపార్ట్‌మెంట్లలో ఒకేసారి ఏసీబీ, ఈడీ, ఆదాయపన్ను శాఖల సంయుక్త సోదాలు జరపాలని డాక్టర్ భద్రయ్య ప్రభుత్వాన్ని కోరారు. లంచగొండి అధికారుల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సర్టిఫికెట్లు, భూ సమస్యలు, అనుమతుల కోసం నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని, ఇలాంటి వ్యవస్థను ప్రక్షాళన చేస్తేనే ప్రజలకు నిజమైన సుపరిపాలన అందుతుందని ఆయన పేర్కొన్నారు.

Read More →
మహారాష్ట్రలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలకు హాజరైన ఎన్ హెచ్ ఆర్ సి. నాయకులు  జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

మహారాష్ట్రలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలకు హాజరైన ఎన్ హెచ్ ఆర్ సి. నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

అంకిసా

2026-06-19

మహారాష్ట్రలోని గడ్చరోలి జిల్లా అంకిసా మండల కేంద్రంలో జరిగిన భవ్య హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చంద్రశేఖర్ శర్మ, హిందూ ప్రసంగీకులు కృష్ణమోహన్, దీన్ దయాల్, జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) నేషనల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య హాజరయ్యారు.చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించారు.శివాజీ కీర్తి ప్రతిష్టలను కొనియాడారు.భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులతో పాటు అడిగెల నగేష్, అచ్చ మురళీధర్, చామల అశోక్, చింతం రాజు, గంజి మహేష్, శ్యాంసుందర్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బండి సదానందం, మండల అధ్యక్షులు చల్లగురుగు

Read More →
ప్రతి పౌరుడు తమ బాధ్యతలను, హక్కులను తెలుసుకోవాలి  ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య  విజయవంతమైన వాజేడు, వెంకటాపురం మండలాల సమావేశం

ప్రతి పౌరుడు తమ బాధ్యతలను, హక్కులను తెలుసుకోవాలి ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య విజయవంతమైన వాజేడు, వెంకటాపురం మండలాల సమావేశం

వెంకటాపురం/వాజేడు/ములుగు

2026-06-19

ప్రతి పౌరుడు తమ బాధ్యతలను, హక్కులను తెలుసుకోవాలని, వాటి పట్ల అవగాహన కలిగి గొప్ప సమాజం కోసం కృషి చేయాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య అన్నారు.వెంకటాపురం మండల అధ్యక్షులు రాయుడు జయరాజు అధ్యక్షతన మండల కేంద్రంలో జరిగిన వాజేడు, వెంకటాపురం రెండు మండలాల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో అవినీతి అక్రమాలు పెరిగిపోతున్నాయని వాటినీ నిరోధించడానికి ప్రతి ఒక్కరు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉపయోగించుకొని ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం లీగల్ ప్రొసీజర్ తో తమ జాతీయ మానవ హక్కుల కమిటీ తీవ్రంగా కృషి చేస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గోగులమూడి హరికృష్ణ, కుంట ఏడుకొండలు, పిల్లల లీలారాణి, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి సన్నగుండ్ల వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు గాదే శ్రీనివాసచారి, జిల్లా కమిటీ సభ్యులు లూర్ద్ రాజు, గుర్రం సుభాషిని, గుర్రం రాజేష్, శెట్టిపల్లి రామకృష్ణ, మంగపేట మండల ఉపాధ్యక్షులు గుడిసేవ నాగేశ్వరరావు, ములుగు వెంకటాపూర్ మండల ఉపాధ్యక్షులు పులాల రమేష్,వాజేడు, వెంకటాపురం మండలాలలోని మహిళా సంఘాల ప్రతినిధులు, సామాజిక ఉద్యమకారులు, విద్యావంతులు సుమారుగా 500 మంది భారీగా స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకర్షించాయి. అనంతరం ప్రధాన కార్యదర్శి సన్నగుండ్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వాజేడు మండల కమిటీని ప్రకటించారు. వెంకటాపురం మండల కమిటీలో స్వల్ప మార్పు చేర్పులు చేసి పూర్తిస్థాయి మండల కమిటీని ప్రకటించారు.

Read More →
జూబ్లీహిల్స్‌లో అస్మత్ ఉన్నిసా ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు

జూబ్లీహిల్స్‌లో అస్మత్ ఉన్నిసా ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు

హైదరాబాద్

2026-06-19

జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) రాష్ట్ర కమిటీ సభ్యురాలు అస్మత్ ఉన్నిసా ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లోని లిటిల్ స్టార్ హైస్కూల్ ప్రాంగణంలో గురువారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం ముస్లిం సోదరులకు అత్యంత ఆధ్యాత్మికత, నియమ నిష్ఠలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఉపవాస దీక్షతో అల్లాపై విశ్వాసం పెంపొందించుకోవడం, సత్యం, ధర్మ మార్గంలో నడుచుకోవడం ఈ పవిత్ర మాసం యొక్క ప్రత్యేకత అని తెలిపారు. సమాజంలో సౌహార్దం, పరస్పర గౌరవం పెంపొందించుకోవడానికి ఇలాంటి ఇఫ్తార్ విందులు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ పవిత్ర రంజాన్ మాసం ముబారక్ అని శుభాకాంక్షలు తెలియజేశారు. అస్మత్ ఉన్నిసా మాట్లాడుతూ ప్రతి ముస్లిం సోదరుడు రంజాన్ మాసంలో రోజా పాటిస్తూ అల్లా కరుణకు పాత్రులవుతారని చెప్పారు. ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు నిర్వహించడం తో పాటు పేదలకు సహాయం చేసే అవకాశం అల్లా ప్రసాదించాలని ఆమె ఆకాంక్ష వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ డివిజన్ అధ్యక్షులు సురవరం రాజేంద్రప్రసాద్, వరంగల్ జిల్లా అధ్యక్షులు యార మధుకర్ రెడ్డి, వరంగల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఆవునూరి కిషోర్, జూబ్లీహిల్స్ కాలనీ ప్రెసిడెంట్ ఎస్.ఎం. సదృద్దీన్, అన్వర్, బాబురావు, అజిత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Read More →
ముత్యంపేట సర్పంచ్ దారం ఆదిరెడ్డిని సన్మానించిన డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్, ఉపసర్పంచులకు అభినందనలు

ముత్యంపేట సర్పంచ్ దారం ఆదిరెడ్డిని సన్మానించిన డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్, ఉపసర్పంచులకు అభినందనలు

జగిత్యాల

2026-06-19

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ముత్యంపేట గ్రామంలో భక్తులకు సంబంధించిన సులభ కాంప్లెక్స్ సంబంధించిన బాట కబ్జాకు గురైన సందర్భంలో జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) జగిత్యాల జిల్లా అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బాటను పునరుద్ధరించడానికి ఒక ఏడాది కాలం పాటు ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అనేక విజ్ఞప్తులు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొండగట్టు గ్రామాన్ని సందర్శించిన సమయంలో మంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ దారం ఆదిరెడ్డి జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరిస్తానని మంత్రి ముందు జాతీయ మానవ హక్కుల కమిటీ నేతలకు మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సర్పంచ్ ఆదిరెడ్డి, ఉపసర్పంచ్ ముత్యంరెడ్డి సులభ కాంప్లెక్స్ కు సంబంధించిన బాటను పునరుద్ధరించడానికి కబ్జాకు గురైన అక్రమ నిర్మాణాలను జెసిబి సహాయంతో కూలగొట్టించారు. భక్తులకు సౌకర్యవంతంగా సులభ కాంప్లెక్స్ పరిసరాలను తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) జగిత్యాల జిల్లా నేతలు లేవనెత్తిన సమస్యను మంత్రి సహకారంతో పరిష్కరించిన గ్రామసర్పంచ్ దారం ఆదిరెడ్డిని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ఘనంగా సన్మానించి అభినందించారు. ఉపసర్పంచి ముత్యంరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను తన సమస్యగా భావించి పరిష్కరించిన వారు చరిత్రలో నిలుస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చేకూట శేకర్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి సామల లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు కోల రాజేశం గౌడ్, జగిత్యాల పట్టణ అధ్యక్షులు గుగ్గిళ్ళ సత్యనారాయణ, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, భూపాలపల్లి జిల్లా నాయకులు గొల్లపల్లి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Read More →
తెలంగాణ ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు చేపట్టాలి  ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్య అత్యంత బాధాకరం   ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు   జాతీయ మానవ హక్కుల కమిటీ వరంగల్ జిల్లా అధ్యక్షులు యార మధుకర్ రెడ్డి

తెలంగాణ ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు చేపట్టాలి ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్య అత్యంత బాధాకరం ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు జాతీయ మానవ హక్కుల కమిటీ వరంగల్ జిల్లా అధ్యక్షులు యార మధుకర్ రెడ్డి

వరంగల్

2026-06-19

ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న సమ్మెకు జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) పూర్తి మద్దతు తెలుపుతుందని వరంగల్ జిల్లా అధ్యక్షులు యార మధుకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ఆత్మహత్యలు పరిష్కారం కాదని చర్చల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని,కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని,ట్రేడ్ యూనియన్ లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘాల ఎలక్షన్లు నిర్వహించాలని,సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లు,కండక్టర్లు మరియు ఇతర సిబ్బంది ఎన్నో సంవత్సరాలుగా వేతన సమస్యలు,ఉద్యోగ భద్రత లోపం,అధిక పని భారం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.కార్మికులపై ఎలాంటి అణచివేత చర్యలు తీసుకోవద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంగెం రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు గుజ్జ సురేందర్, వెంకట్రాజం, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కిషోర్, నూనె తిలక్, నల్లబెల్లి మండల అధ్యక్షులు నాగపురి రమేష్, సంగం మండల అధ్యక్షులు బొల్లబోయిన రాజేందర్, చెన్నారావుపేట మండల అధ్యక్షులు మంద నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Read More →
ప్రతి పౌరుడు తమ హక్కులను, బాధ్యతలను తెలుసుకోవాలి

ప్రతి పౌరుడు తమ హక్కులను, బాధ్యతలను తెలుసుకోవాలి

హైదరాబాద్

2026-06-19

ప్రతి పౌరుడు తమ హక్కులను, బాధ్యతలను తెలుసుకొని భారత రాజ్యాంగం ఇచ్చిన చట్టాల ప్రకారం శక్తులుగా ఎదగాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పిలుపునిచ్చారు. హైదరాబాదులో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యక్తులు శక్తులుగా ఎదిగినప్పుడే గొప్ప సమాజాన్ని నిర్మించిన వాళ్ళమవుతామని ఆయన స్పష్టం చేశారు. దేశంలో అవినీతి అక్రమాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, దేశ సంపద, ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు చైతన్యవంతులు అయినప్పుడే మన దేశాన్ని గొప్పగా తయారు చేసుకోవచ్చని ఆయన అన్నారు. హైదరాబాద్ జిల్లాలో అన్ని కమిటీలు పూర్తిచేయాలని ఈ సందర్భంగా జిల్లా కమిటీ నాయకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో హైదరాబాదు జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ స్వప్న, ఉపాధ్యక్షురాలు గల్వ సునీతారెడ్డి, నాయకులు మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

Read More →
జాతీయ మానవ హక్కుల కమిటీ వనపర్తి జిల్లా అధ్యక్షులుగా పసుపుల రవికుమార్ ప్రధాన కార్యదర్శిగా ఎండి అవేజ్ నియామకం

జాతీయ మానవ హక్కుల కమిటీ వనపర్తి జిల్లా అధ్యక్షులుగా పసుపుల రవికుమార్ ప్రధాన కార్యదర్శిగా ఎండి అవేజ్ నియామకం

వనపర్తి

2026-06-19

జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) వనపర్తి జిల్లా కమిటీని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ప్రకటించారు.రాష్ట్ర కమిటీ సభ్యులు ఎండి సమి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులుగా పసుపుల రవికుమార్, ఉపాధ్యక్షులుగా జానంపేట శంకర్, ప్రధాన కార్యదర్శిగా ఎండి అవేజ్ లను నియమిస్తూ నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం జాతీయ మానవ హక్కుల కమిటీ కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల సంపదను ప్రభుత్వ ఖజానాను లూటీ చేసే అవినీతి అక్రమార్కులను సమాజంలో దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు. భారత రాజ్యాంగ చట్టాలను అనుసరించి తమ సంస్థ లీగల్గా పేద ప్రజల కోసం పనిచేస్తుందని ఆయన తెలిపారు. వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన పసుపుల రవికుమార్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పజెప్పిన రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో అన్ని మండల కమిటీలు, గ్రామ కమిటీలు పూర్తి చేసి సంస్థను బలోపేతం చేసి ప్రజల పక్షాన నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు.

Read More →