← Back to Events
జాతీయ మానవ హక్కుల కమిటీ హనుమకొండ జిల్లా కమిటీ ముఖ్య నాయకుల సమావేశం
హన్మకొండ2026-08-04

జాతీయ మానవ హక్కుల కమిటీ హనుమకొండ జిల్లా కమిటీ ముఖ్య నాయకుల సమావేశం

*జాతీయ మానవ హక్కుల కమిటీ హనుమకొండ జిల్లా కమిటీ సమావేశం* *సంస్థ విధి విధానాలపై అవగాహన కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య* హనుమకొండ,ఆగస్టు03(అక్షరజ్యోతి ప్రతినిధి): జాతీయ మానవ హక్కుల కమిటీ(ఎన్‌హెచ్‌ఆర్‌సి) హనుమకొండ జిల్లా కమిటీ ముఖ్య నాయకుల సమావేశం జిల్లా అధ్యక్షులు పల్లెబోయిన మహేష్ ముదిరాజ్ అధ్యక్షతన హనుమకొండ జిల్లా కేంద్రంలోని చింత చింతగట్టు ఎస్‌పీ ఆర్ గార్డెన్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణే సంస్థ ప్రధాన లక్ష్యమని, సమాజంలో అణగారిన వర్గాలకు న్యాయం అందించేందుకు ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలని పిలుపునిచ్చారు. సంస్థ విధి విధానాలు, రాజ్యాంగ పరమైన హక్కులు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సామాన్య ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అన్యాయానికి గురైన బాధితులకు తక్షణ న్యాయ సహాయం అందించేందుకు జిల్లా కమిటీ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అక్షరజ్యోతి మీడియా పాత్రపై పూర్తిస్థాయి విశ్లేషణ చేస్తూ, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో మీడియా బాధ్యత ఎంతో ఉందని తెలిపారు. జిల్లాలో సంస్థ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకులను అభినందించారు. రాబోయే రోజుల్లో గ్రామస్థాయి వరకు కమిటీలను విస్తరించి, మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ఇన్చార్జి గూడూరు నరేందర్, జిల్లా ఉపాధ్యక్షులు కొడవటి తిరుపతి, ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, శాయంపేట మండల అధ్యక్షులు ఏదుల రాజశేఖర్, నడికూడ మండల అధ్యక్షులు ప్రవీణ్, సంగెం మండల అధ్యక్షులు రాజేందర్ యాదవ్, నాయకులు ఆనందం, సూరపాక రాజు, బిక్షపతి, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.