
ప్రతి పౌరుడు తమ హక్కులను, బాధ్యతలను తెలుసుకోవాలి
ప్రతి పౌరుడు తమ హక్కులను, బాధ్యతలను తెలుసుకొని భారత రాజ్యాంగం ఇచ్చిన చట్టాల ప్రకారం శక్తులుగా ఎదగాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పిలుపునిచ్చారు. హైదరాబాదులో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యక్తులు శక్తులుగా ఎదిగినప్పుడే గొప్ప సమాజాన్ని నిర్మించిన వాళ్ళమవుతామని ఆయన స్పష్టం చేశారు. దేశంలో అవినీతి అక్రమాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, దేశ సంపద, ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు చైతన్యవంతులు అయినప్పుడే మన దేశాన్ని గొప్పగా తయారు చేసుకోవచ్చని ఆయన అన్నారు. హైదరాబాద్ జిల్లాలో అన్ని కమిటీలు పూర్తిచేయాలని ఈ సందర్భంగా జిల్లా కమిటీ నాయకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో హైదరాబాదు జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ స్వప్న, ఉపాధ్యక్షురాలు గల్వ సునీతారెడ్డి, నాయకులు మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.