
తెలంగాణ ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు చేపట్టాలి ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్య అత్యంత బాధాకరం ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు జాతీయ మానవ హక్కుల కమిటీ వరంగల్ జిల్లా అధ్యక్షులు యార మధుకర్ రెడ్డి
ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న సమ్మెకు జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) పూర్తి మద్దతు తెలుపుతుందని వరంగల్ జిల్లా అధ్యక్షులు యార మధుకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ఆత్మహత్యలు పరిష్కారం కాదని చర్చల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని,కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని,ట్రేడ్ యూనియన్ లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘాల ఎలక్షన్లు నిర్వహించాలని,సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లు,కండక్టర్లు మరియు ఇతర సిబ్బంది ఎన్నో సంవత్సరాలుగా వేతన సమస్యలు,ఉద్యోగ భద్రత లోపం,అధిక పని భారం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.కార్మికులపై ఎలాంటి అణచివేత చర్యలు తీసుకోవద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంగెం రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు గుజ్జ సురేందర్, వెంకట్రాజం, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కిషోర్, నూనె తిలక్, నల్లబెల్లి మండల అధ్యక్షులు నాగపురి రమేష్, సంగం మండల అధ్యక్షులు బొల్లబోయిన రాజేందర్, చెన్నారావుపేట మండల అధ్యక్షులు మంద నరేష్ తదితరులు పాల్గొన్నారు.