← Back to Events
దుబ్బాక- సికింద్రాబాద్ బస్సు పునరుద్ధరించండి
దౌల్తాబాద్ /సిద్దిపేట2026-09-13

దుబ్బాక- సికింద్రాబాద్ బస్సు పునరుద్ధరించండి

సిద్దిపేట జిల్లా కలెక్టర్ కు ప్రత్యేక విజ్ఞప్తి చేసిన జాతీయ మానవ హక్కుల కమిటీ దౌల్తాబాద్ మండల అధ్యక్షురాలు రంగన్నగారి వనజా రెడ్డి *బస్సు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న14 గ్రామాల ప్రజలు* దౌల్తాబాద్/సిద్దిపేట,సెప్టెంబర్12(అక్షరజ్యోతి ప్రతినిధి):సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో గతంలో దుబ్బాక నుండి సికింద్రాబాద్ వరకు నడిచిన ఆర్టీసీ బస్సును మళ్లీ వెంటనే పునరుద్ధరించి నడిపించాలని జాతీయ మానవ హక్కుల కమిటీ(ఎన్ హెచ్ ఆర్ సి)దౌల్తాబాద్ మండల అధ్యక్షురాలు రంగన్నగారి వనజా రెడ్డి సిద్దిపేట జిల్లా కలెక్టర్ కు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు,రోడ్డు గుంతలమయం కావడం వల్ల బస్సును నిలిపివేయడంతో 14 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు,ముఖ్యంగా విద్యార్థులు,మహిళలు,వృద్ధులు,దినసరి కూలీలు,ఆస్పత్రులకు వెళ్లే రోగులు బస్సు లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి అధిక చార్జీలు చెల్లించాల్సి వస్తోందని,ఉదయం,సాయంత్రం వేళల్లో సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారని పేర్కొన్నారు,ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు,ముఖ్యంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి దుబ్బాక-సికింద్రాబాద్ బస్సును పునరుద్ధరించి ప్రజల సమస్యను పరిష్కరించాలని,దుబ్బాక ఆర్టీసీ డిపో మేనేజర్ కూడా ప్రజల సమస్యలపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.